శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

తిరుమల శ్రీవారిని తెలంగాణ Dy. CM భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కుమారుడి పెళ్లి తర్వాత శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు భట్టి తెలిపారు. త్వరలో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని, ప్రపంచం పోటీ పడేలా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.