12 నుంచి SMATలో ఆడనున్న రోహిత్!
రోహిత్ శర్మ ఈ నెల 12 నుంచి సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం SAతో వన్డే సిరీస్ ఆడుతున్న అతను DEC 6న చివరి వన్డే తర్వాత ఖాళీ అవుతాడు. దీంతో SMAT సూపర్ లీగ్‌లో ఆడాలనుకుంటున్నట్లు MCAకి తెలియజేశాడని ముంబై టీమ్ వర్గాలు తెలిపాయి. అటు ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచిన ముంబై.. గ్రూప్ A టాపర్‌గా సూపర్ లీగ్ రేసులో ఉంది.