టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపీ సానా సతీష్

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపీ సానా సతీష్

E.G: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కాకినాడ నగరానికి చెందిన రాజ్యసభ సభ్యులు సనా సతీష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎంపీ సానా సతీష్ బాబుని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు.