VIDEO: వనభోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: పెందుర్తి అక్కిరెడ్డిపాలెం సౌభాగ్య లేఅవుట్లో ఆదివారం నిర్వహించిన గౌరీ సేవా సంఘం వనభోజనంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, మల్లా సురేంద్ర, వేగి పరమేశ్వరరావు తదితర నాయకులు హాజరయ్యారు.