హర్మూజ్‌ జలసంధికి అమెరికా రక్షణ కల్పిస్తుంది: ట్రంప్

హర్మూజ్‌ జలసంధికి అమెరికా రక్షణ కల్పిస్తుంది: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్‌లో చమురు నౌకలకు అవసరమైతే US నేవీ రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ప్రపంచానికి ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అగ్రరాజ్యం చూస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత చమురు మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.