విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

KMM: మధిర వన్ టౌన్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా మెయిన్ రోడ్డు, లడక్ బజార్, ఆజాద్ రోడ్డు, R&B ఆఫీస్ ఏరియా, సిపిఐ ఆఫీస్ రోడ్డు, బాలికల హై స్కూల్ ఏరియాలో ఉ.9 గంటల నుంచి మ.ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.