VIDEO: కుంకనూరులో మురుగు నీటి కష్టాలు
KNRL: దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల ముందే ప్రవహిస్తోంది. దుర్వాసనతో ప్రధాన వీధుల్లో నడవలేని పరిస్థితి ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పన్నులు చెల్లిస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.