సంగమేశ్వరుని దర్శించుకున్న వరంగల్ జిల్లా ASP

సంగమేశ్వరుని దర్శించుకున్న వరంగల్ జిల్లా ASP

SRD: ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని వరంగల్ జిల్లా ASP రవి నేడు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద అదనపు ఎస్పీకి మంగళవాయిద్యాల మధ్య అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు, గర్భగుడిలోని అభిషేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప ASPకి శాలువా కప్పి సన్మానించారు