'ఎస్పీఆర్ హిల్స్‌లో రూ.20 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్'

'ఎస్పీఆర్ హిల్స్‌లో రూ.20 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్'

HYD: మహిళా సాధికారతలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు. నగరంలో మంజూరైన 4 హాస్టళ్లలో భాగంగా దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, ఉద్యోగినులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.