VIDEO: వర్ధన్నపేట ఆసుపత్రిపై కలెక్టర్, ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలసి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అపరిశుభ్రత, సిబ్బంది నిర్లక్ష్యంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించి గైర్హాజరైన వైద్యులపై మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.