బాలిక కిడ్నాప్.. సినిమాను తలపించిన ఘటన

ప్రకాశం: చీమకుర్తిలోని ఓప్రైవేటు స్కూల్ నుంచి శుక్రవారం బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. బాలిక తండ్రి నుంచి రూ.5లక్షలు అప్పు తీసుకున్న ఈశ్వర్ రెడ్డి, తిరిగి ఇవ్వలేదనే కారణంతో బాలికను అపహరించాడు. అనంతరం బాలికతో తండ్రికి ఫోన్ చేయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈశ్వర్ రెడ్డి తిరుపతి వైపు తీసుకెళ్తుండటంతో పోలీసులు గాలిస్తున్నారు.