బడికొస్తే.. రూపాయి ఇస్తా..!

బడికొస్తే.. రూపాయి ఇస్తా..!

SRPT: బడికి వస్తే రోజుకో రూపాయి.. అంటూ సరిగా బడికి రాని పిల్లలను రోజూ వచ్చేలా ఆకర్షిస్తున్నారు. గరిడేపల్లి మండలం రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు చారగుండ్ల రాజశేఖర్‌ ఈ వినూత్న ఆలోచన చేశాడు. ఆయన మాట్లాడుతూ.. చిన్నచిన్న బహుమతులే విద్యార్థుల జీవితాల్లో మార్పులు తెస్తాయంటున్నారు. నాడు ఆరుగురు మాత్రమే ఉన్న రంగాపురం పాఠశాలలో ఇప్పుడు 20 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.