పోలీసులకు దక్కిన 'స్కోచ్' అవార్డుపై డీజీపీ ప్రశంసలు

పోలీసులకు దక్కిన 'స్కోచ్' అవార్డుపై డీజీపీ ప్రశంసలు

NRML: జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకమైన 'స్కోచ్' (SKOCH) అవార్డు దక్కడం పట్ల రాష్ట్ర డీజీపీ శివధర్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'పోలీస్ అక్కలతో మాట ముచ్చట' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న వినూత్న పోలీస్ సంస్కరణలు పోలీసుల అద్భుత పనితనానికి నిదర్శనమని కొనియాడారు.