ఆపరేషన్ సింధూర్‌ని ఆహ్వానిస్తున్నాం: ఎమ్మెల్సీ

NLG: ఆపరేషన్ సింధూర్‌ని అందరం ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బుధవారం అన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా పోరాడుతున్న భారతదేశ పోరాటం చరిత్రాత్మకమన్నారు. ఇండో-పాక్ సందర్భంలో ఇందిరా గాంధీ చూపించిన తెగువనే మోదీ చూపడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వానికి భారతీయులంతా మద్దతునివ్వాలన్నారు.