'ఉగ్రవాదాన్ని ఇస్లాం ఎంత మాత్రం సమర్థించదు'

RR: ఉగ్రవాదాన్ని ఇస్లాం ఎంత మాత్రం సమర్థించదని షాద్ నగర్ ముస్లిం మైనార్టీ సోదరులు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రవాద దుశ్చర్యపై కదం తొక్కుతూ భారత ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేశారు. షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గల జామియా మస్జిద్ నుండి పట్టణానికి చెందిన వేలాదిమంది ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.