కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MNCL: జైపూర్ వైపు వెళ్తున్న కారు, బైక్ కుందారం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమారం 108 సిబ్బంది EMT రమేశ్, పైలెట్ హరీశ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.