వైసీపీ మహిళా కార్యదర్శిగా కవిత నియామకం
సత్యసాయి: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన కవిత జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కవిత ఆదివారం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కవితకు శ్రీధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.