త్వరలోనే నిధులు మంజూరు: ఎమ్మెల్యే

RR: మన్సురాబాద్ డివిజన్‌లోని ఆగమయ్య కాలనీలో నిర్వహించిన కాలనీవాసులు సమావేశంలో ఈరోజు MLA సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు MLA దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలు ముఖ్యమైన సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.