జగిత్యాలలో వాసవి జయంతి వేడుకలు

జగిత్యాలలో వాసవి జయంతి వేడుకలు

JGL: జగిత్యాల పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యంలో వాసవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఆలయం నుంచి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బండ శంకర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షుడు నవీన్ ఉన్నారు.