VIDEO: వాహనదారులకు డీఎస్పీ కౌన్సెలింగ్

GNTR: తెనాలిలో గత రాత్రి నిర్వహించిన వాహన తనిఖీలలో సీజ్ చేసిన వాహన యజమానులకు డీఎస్పీ జనార్ధనరావు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం వద్దకు వాహనదారులను పిలిపించి మాట్లాడారు. సీజ్ చేసిన వాటిలో సరైన నెంబర్ ప్లేట్లు లేని అనేక వాహనాలను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రతిరోజు తనిఖీలు ఉంటాయని సరైన పత్రాలు మెయింటైన్ చేయాలని హెచ్చరించారు