సామాజిక శ్రద్ద.. జవహర్ కృషికి స్పందించిన అధికారులు
E.G: కొవ్వూరులోని నందమూరు, యువరాజ్ ఫంక్షన్ హల్ రోడ్డులో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలు నుండి వ్యర్థాలను తీస్తున్నారు. తీసిన వాటిని రోడ్లకు ఇరువైపులా వేయడంతో అటుగా వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకుడు కొప్పాక జవహర్ విజయనంద కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీసిన సిల్ట్‌ను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.