ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీలు
GDWL: ఉండవెల్లి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఉండవెల్లి మండల అభివృద్ధి అధికారి తిరుపతి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మండలంలోని ఈనెల 31 నుండి తనిఖీలు చేస్తామని తెలిపారు.