రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
AP: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు-బెంగళూరు హైవేపై గంగవరం వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను హరీష్, యుగంధర్‌గా గుర్తించారు. ఇద్దరూ తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.