రేపు ఛలో గంటూరు: మాజీ మంత్రి
VSP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు శనివారం 'ఛలో గుంటూరు' నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. అంబటి ఇంటిపై దాడి రాజకీయ ప్రేరేపితమని, స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని పేర్కొన్నారు.