కోతులను తరిమేందుకు చింపాంజీ వేషధారణ
జనగామ కలెక్టరేట్ పరిధిలో ఉద్యోగులు, సిబ్బందిపై కోతులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, మున్సిపల్ సిబ్బంది వినూత్న పద్ధతిని అవలంబించారు. కోతుల బెడదను నివారించేందుకు, మున్సిపల్ సిబ్బంది చింపాంజీ వేషధారణలో కలెక్టరేట్లో తిరుగుతూ వానరాలను భయపెడుతున్నారు. ఈ చర్యలు అన్ని గ్రామాల్లోనూ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.