వెంకటేశ్వరపల్లిలో పొలం బాట కార్యక్రమం

WGL: రాయపర్తి మండలం మైలారం సెక్షన్‌లోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులు గురువారం పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈటీ ఇంచార్జ్ డీఈ ఆనందం, ఏడీఈ నటరాజ్ హాజరై రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలు అధికారులకు సూచించాలన్నారు.