కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: కలెక్టర్
MNCL: కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామ శివారులో ఉన్న జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరను ఇచ్చి పత్తిని కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఉన్నారు.