VIDEO: మరో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
PLND: రెడ్డిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తుండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికి ఏ అపాయము జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.