VIDEO: విద్యార్థులను చితకబాదిన టీచర్

ప్రకాశం: గిద్దలూరు బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయురాలు బెత్తంతో కొట్టిన ఘటన శుక్రవారం జరిగింది. స్కూల్ యూనిఫాం వేసుకురాలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.