చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరగాలి: మంత్రి
JN: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి సూచించినట్లు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి సోమవారం నిర్వహించిన వీసీలో పాల్గొని కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ 20 నాటికి చేప, రొయ్య పిల్లల విడుదల పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.