బైక్, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
NRML: నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉడుంపూర్, రాం పూర్ మధ్య గల ప్రధాన రహదారిపై బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భీంరావు(20), రాంబాయి(45) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.