పెద్ద చెరువులో చేపలను విడుదల చేసిన ఎమ్మెల్యే
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో తెలంగాణ ప్రభుత్వం 100% రాయితీపై అందిస్తున్న చేప పిల్లలను మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకార సంఘాలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, వరదల్లో నష్టపోయిన మత్స్య రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.