సైకిల్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురికి గాయాలు
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడివాగు వద్ద జాతీయ రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న మోటార్ సైకిల్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ములుగు మండలం సర్వాపురానికి చెందిన నారాయణ, ఆయన భార్య రాణి, కుమారుడు చరణ్ తేజకు గాయాలయ్యాయి. పోలీసులు తమ వాహనంలో వీరిని ములుగు జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.