కోదండ రామాలయం ఎదుట కళాబృందం ధర్నా

కడప: ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణం ముఖద్వారం వద్ద గురువారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా కళాబృందం పీఠాధిపతి జయశంకర్ ఆధ్వర్యంలో దాదాపు ధర్నాకు దిగారు. బుధవారం ఆలయంలో కళాబృందం వారి భజన కార్యక్రమం జరుగుతుండగా ఒంటిమిట్ట పోలీస్ సిబ్బంది బలవంతంగా మైకులు తీసుకెళ్లారన్నారు. అందుకు నిరసనగా ఇవాళ ధర్నాకు దిగామని వారు తెలిపారు.