ఆహారాన్ని బాగా నమలట్లేదా?

ఆహారాన్ని బాగా నమలట్లేదా?

ఆహారాన్ని సరిగా నమలకుండా, హడావిడిగా తినకండి. ఎందుకంటే జీర్ణక్రియ అనేది నోటిలోనే ప్రారంభమవుతుంది. బాగా నమలడం వల్ల ఆహారం చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలంలోని ఎంజైములు అందులో బాగా కలిసి జీర్ణ ప్రక్రియను మొదలుపెడతాయి. సరిగ్గా నమలకుండా, వేగంగా ఆహారం తీసుకుంటే కడుపు, పేగులపై ఒత్తిడి పెరుగుతుంది. అవి సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. పోషకాల శోషణ తగ్గుతుంది.