దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

NZB: నగరం ఎరుకలవాడలో శుక్రవారం జరిగిన దొంగతనం కేసును నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన కోజా కాలనీకి చెందిన మీర్జా అతర్ బైగ్ అత్తు, షేక్ అజ్మాద్, అహూలను అరెస్టు చేశారు. గంజ్ వద్ద పట్టుకున్న వీరి నుంచి బంగారు ముక్కుపుడక, ఉంగరం, వెండి కడియాలు, స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.