VIDEO: ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు
NLR: జిల్లాలో కోలగట్ల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన నెలకొంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లు స్తానికులు పేర్కొన్నారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మిగతా వారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.