రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరు

రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరు

BPT: వేమూరు నియోజకవర్గంలో ఐదు రైల్వే క్రాసింగ్ లైన్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.261 కోట్లు మంజూరు చేసింది. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చేసిన కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్వోబీల నిర్మాణం పూర్తయితే వేమూరు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఎంపీ పేర్కొన్నారు.