ఖమ్మంలో సీఎం సతీమణి కారు తనిఖీ

ఖమ్మంలో సీఎం సతీమణి కారు తనిఖీ

ఖమ్మంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తున్న క్రమంలో కూసుమంచి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర ఈ తనిఖీ జరిగింది. పోలీసులకు ఆమె సహకరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.