ముగ్గురు విద్యార్థులు చనిపోవడం బాధాకరం: MLA

ముగ్గురు విద్యార్థులు చనిపోవడం బాధాకరం: MLA

కృష్ణా: చిక్కవరం సుందరయ్య చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచివేసిందని MLA వెంకట్రావ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ తవ్వకాల వల్ల గన్నవరంలో గత 4-5 ఏళ్లలో 34 మంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అక్రమంగా మట్టి తవ్వేసి ప్రాణాలు తీస్తున్న వారిపై మర్డర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.