VIDEO: 'దోషులకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు'
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను, రిపోర్ట్‌ను కోర్టు తప్పుబట్టలేదని, విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ నివేదికను తప్పుబట్టలేదన్నారు. దోషులకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నది వాస్తవమని పేర్కొన్నారు.