ప్రజల ప్రాణాల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

ప్రజల ప్రాణాల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

GNTR: ప్రజల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యమేమీ కాదని సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న మంచివిధానాలను ఇతర జిల్లాలు కూడా అనుసరించాలన్నారు.