చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్

GDWL: జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.