సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
VZM: ఎస్‌కోట మండలం గౌరీపురంలోని ఓ హై స్కూల్లో సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై గురువారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోక్సో కేసులు, రహదారి భద్రతా చట్టాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.