సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వలసల జోరు
WGL: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో చేరికలు హోరెత్తాయి. కాంగ్రెస్, BRS, BJP అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకీ వలసలు కొనసాగుతున్నాయి. డబ్బు, మద్యం, పదవుల ఆశలతో నాయకులు ఆకర్షిస్తుండగా, యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నిన్న నర్సంపేట్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ చేరికలు నమోదయ్యాయి.