మద్యం మత్తులో వ్యక్తి మృతి
నెల్లూరులోని జనార్ధన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ ఖాదర్ హుస్సేన్ (48) మృతిచెందాడు. మద్యం మత్తులో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి ముందు పడిపోయినట్లు సమాచారం. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుని కుమార్తె షర్మిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.