VIDEO: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహణ

SKLM: వారధి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు డిబేటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. గురువారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు వీటిని చేపడుతున్నామని వివరించారు. వీరిలో గెలుపొందిన విజేతలు నియోజకవర్గ, జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.