ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ
NRPT: మరికల్ మండల కేంద్రంలోని రెయిన్ బో ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. విద్యార్థులు అధికార, ప్రతిపక్ష నాయకుల పాత్రలు పోషించి అసెంబ్లీ సమావేశాన్ని అచ్చు గుద్ధినట్లు నిర్వహించారు. మాక్ అసెంబ్లీ పలువురుని ఆకట్టుకుంది. పాఠశాల కరస్పాండెంట్ షఫీ, ప్రిన్సిపల్ ఆస్మా, విద్యార్థులు పాల్గొన్నారు.