తాగునీటి కోసం ఎమ్మెల్యేకు వినతి
W.G: భీమవరం ప్రకాశ్ నగర్‌లో రెండు రోజులుగా మంచినీటి ట్యాంకర్ రాక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే రామాంజనేయులుకు విన్నవించుకున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎమ్మెల్యే స్పందించి RWS డీఈతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ట్యాంకర్ పంపించాలని సూచించారు.