ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లి వేదికగా ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను పీఎం-కిసాన్‌తో కలిపి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జిల్లా అధికారులతో కలిసి బుధవారం రాత్రి పరిశీలించారు.